ఉప్పొంగిన భక్తి పారవశ్యం
సోమశిల సోమేశ్వరాలయం ఆవరణలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు
కృష్ణానదిలో స్నానాలు చేస్తున్న భక్తులు
కొల్లాపూర్ రూరల్: కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమశిలకు భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. సమీపంలోని సోమేశ్వరాలయంలో సోమేశ్వరుడితో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు, లలితాంభిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం కొల్లాపూర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు.
ఉప్పొంగిన భక్తి పారవశ్యం


