వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
మహబూబ్‌నగర్ రూరల్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి కల్యాణ వేడుక నిర్వహించారు. అశేష భక్తజనం తిలకిస్తుండగా పురోహితుల మంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారికి మంగళసూత్రధారణ కార్యక్రమం కనులపండువగా జరిగింది. అనంతరం తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు.
● కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మన్యంకొండ దేవస్థానంలో భక్తులు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. దేవస్థానంలోని వ్రత మండపంలో సంప్రదాయబద్ధంగా వ్రతాలు నిర్వహించారు.
వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం


