డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్ క్రైం: బీసీ బాలికల వసతి గృహంలో ఫినాయిల్ తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది.కొల్లాపూర్ మండలం మొలచింతపల్లికి చెందిన స్ఫూర్తి నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వవ సైన్స్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుకుంటూ బీసీ బాలికల కళాశాల వసతిగృహంలోనే ఉంటుంది. మంగళవారం ఉదయం తాను ఉంటున్న హాస్టల్‌లోనే ఫినాయిల్ తాగి త్మహత్యాయత్నానికి పాల్పడడంతో గమనించిన తోటి విద్యార్థునులు వెంటనే హాస్టల్ సిబ్బందికి చెప్పడంతో అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం స్ఫూర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషయం తెలుసుకన్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థిని నుంచి సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి ఎస్‌ఐ గోవర్ధన్‌ను వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పడం గమనార్హం.
జనరల్ ఆస్పత్రిలో చికిత్స.. పరిస్థితి విషమం


