జేపీఎన్‌సీఈలో ప్రాంగణ ఎంపికలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ధర్మాపూర్ శివారులోని జేపీఎన్‌సీఈలో మంగళవారం టాస్క్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన టెలి పర్ఫామెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కంటెంట్ మోడరేటర్ ఉద్యోగాలకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఇందులో భాగంగా 182 మంది విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్, లాంగ్వేజ్ అసెస్‌మెంట్, ఆపరేషన్స్ రౌండ్ చేపట్టారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, ప్లేస్‌మెంట్ నిర్వాహకులు రాముల్, జిలానీ, దివ్యతేజ, స్రవంతి, కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ సయన్ చక్రవర్తి, టాస్క్ రీజినల్ హెడ్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


