తల్లి, ముగ్గురు పిల్లల అదృశ్యం
పాన్‌గల్: తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యమైన ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ యాదగిరి తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన మంగదొడ్డి రాంచందర్‌కు కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లికి చెందిన జ్యోతితో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు విషిత(9), భవ్య(8), కుమారుడు తరుణ్(6) ఉన్నారు. రాంచందర్ హామాలీ పని నిమిత్తం నిత్యం జిల్లా కేంద్రానికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 27న రాంచందర్ హమాలీ పనికి వనపర్తికి వెళ్లగా పాఠశాల నుంచి ఉపాధ్యాయులు ఫోన్‌చేసి ముగ్గురు పిల్లలు పాఠశాలకు రాలేదని చెప్పారు. అనంతరం రాంచందర్ తన తల్లిని విచారించగా జ్యోతి ముగ్గురి పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్లు తెలిపింది. చుట్టు పక్కల విచారించగా ఎంతకూ ఆచూకీ లభించ లేదు. దీంతో భార్య, ముగ్గురు పిల్లలు అదృశ్యంపై మంగళవారం రాంచందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ పేర్కొన్నారు.
తల్లి, ముగ్గురు పిల్లల అదృశ్యం


