కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఫీచర్స్
నాగర్‌కర్నూల్ క్రైం: కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మారుతి సుజుకి కంపెనీ కొత్త కొత్త మోడళ్లు, ఫీచర్స్‌తో వాహనాలను అందిస్తుందని శ్రీజయరామ మోటార్స్ సీఈవో నాగేంద్రబాబు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మారుతీ సుజుకీ షోరూంలో నూతనంగా మార్కెట్‌లోకి వచ్చిన విక్టోరియస్ కారును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ.. మారు తి సుజుకీ వచ్చే నూతన వాహనాలన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి ఫీచర్స్‌తో తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.జీఎం వేణుగోపాల్‌రెడ్డి, మేనేజర్ గిరిధర్‌గౌడ్, టీం లీడర్ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.


