అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
బల్మూర్: మండలంలోని మహాదేవ్‌పూర్ శివారులో ని వ్యవసాయ పొలంలో అనుమా నాస్పద స్థితి లో ఓ యువకుడి మృతదే హం మంగళవారం గుర్తించినట్లు ఎస్‌ఐ రా జేందర్ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. మండలంలోని జిన్‌కుంటకు చెందిన మదన మోని సైదులు(25)కు అచ్చంపేట మండలం పల్కపల్లికి చెందిన మంజులతో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. సైదులు పల్కపల్లిలోని అత్తాగారింట్లో భార్యాపిల్లలతో కాపురం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న భార్యాభర్తల మధ్య బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించే విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో సైదులు ఆరోజు ఇంట్లో నుంచి వెళ్లి కనిపించకుండాపోయాడు. భార్య మంజుల అచ్చంపేట పోలీస్‌స్టేషల్లో తన భర్త కనిపించడం లేదని ఫిర్యారు చేసింది. మహదే్‌పూర్ శివారులోని చెట్లపొదల్లో మంగళవారం పశువుల కాపరులు గుర్తించలేని స్థితిలో కుళ్లిపోయిన మృతదేహాన్ని గమనించి కుటంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికెళ్లి పరిశీలించగా.. మృతదేహం వద్ద బైక్, ఫోన్‌తోపాటు పురుగుల మందు డబ్బ, చెట్లు షర్టు కట్టి ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాని తమ కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి బాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.


