
చెట్టును ఢీకొన్న కారు.. యువకుడు మృతి
ఖిల్లాఘనపురం: కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన ఖిల్లాఘనపురం మండలం షాపురం గేటు సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు బిజినేపల్లి మండలం గౌరారం తండాకు చెందిన కేతావత్ సురేష్(21) గురువారం సాయంత్రం తన మిత్రుడి కారు తీసుకుని అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో మరో స్నేహితుడి దగ్గరకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా షాపురం స్టేజి వద్ద టర్నింగ్‌లో ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టాడు. ప్రమాదంలో కారులో ఉన్న సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుక్ను ఎస్‌ఐ వెంకటేష్ ఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో కారును తీయించారు. శుక్రవారం మృతుడి భార్య అనిత(లలిత) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.