
చికిత్స పొందుతూ బాలింత మృతి
నారాయణపేట: జిల్లా కేంద్రానికి చెందిన అనూష (22) అనే బాలింత చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వివరాల్లోకి వెలితే... జిల్లా కేంద్రానికి చెందిన అశోక్ భార్య కాన్పు నిమిత్తం గత నెల 25న జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేరింది. మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఫిడ్స్ రావడంతో వైద్యుల సూచన మేరకు మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి... అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం కన్నుమూసింది. మృతిరాలికి ఇది వరకు ఓ బాబు ఉన్నాడు. పురుడు పోసుకున్న వారం రోజులకే మృతి చెందడంతో పసికందును చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పళ్ల ఏరియాలో విషాదఛాయలు అలుముకున్నాయి.