
గుమ్మకొండ వ్యక్తి మృతి
తిమ్మాజిపేట: మండల పరిధిలోని గుమ్మకొండకు చెందిన హుస్సేన్(40) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. పోతిరెడ్డిపల్లికి చెందిన ఎడ్ల మైబుతో కలిసి హుస్సేన్ ఈ నెల 1న రాత్రి 10.15 గంటలకు బైక్‌పై పెట్రోల్ కోసం తిమ్మాజిపేట వైపు వెళ్లారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో హుస్సేన్, మైబుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మైబు ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మృతుడి అన్న అంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.