
వామ్మో కుక్కకాట్లు..
నవాబుపేట: అందరు దసర సందడిలో ఉంటే కుక్కలు సైతం వీధుల్లోకి వచ్చి స్వైర విహారం చేసి జనాలపై పడ్డాయి. మండలంలో వివిధ గ్రామాల్లో కేవలం రెండు రోజుల్లోనే 18 కుక్కకాట్ల కేసులు నవాబుపేట పీహెసీలో నమోదయ్యాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పండగ కోసం గ్రామాలకు వచ్చిన వారికి కుక్కకాట్ల బయం తీవ్రంగా పెరిగింది. తాజాగా కామారం, కొల్లూర్, కాకర్లపహాడ్, ఫత్తేపూర్, మరికల్, కూచూర్, హన్మసానిపల్లి, కారుకొండలో కుక్కకాట్ల బాధితులు మండల కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స చేసుకున్నారు. ఏకంగా 18మంది 2రోజుల్లోనే ఆస్పత్రికి రావడంతో ఆస్పత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వచ్చినవారికి చికిత్స అందించి ఇంజక్షణ్ ఇచ్చి పంపిస్తున్నారు. కాగా దీనికిగానూ యాంటీ రేబీస్ ఇంజక్షన్ అందుబాటులో ఉంచారు. కాగా ఈ విషయంలో ఆరాతీస్తే ఇప్పటికే ఈ సంవత్సరంలో 263 కుక్కకాట్ల కేసులు నమోదైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
●
మందులున్నాయి.. జాగ్రత్త అవసరం
కుక్కకాట్లకు మందులు అందుబాటులో ఉంచాం. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్కకాట్లు చాలా ప్రమాదకరం. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రధానంగా పిల్లలను కుక్కల పట్ల చాలా జాగ్రత్తగా ఉంచాలి. అది పెంపుడు కుక్క అయిన సరే. మండలంలో రెండు రోజుల్లోనే ఇన్ని కేసులు రావడ చాలా విచారకరం. గ్రామాల్లో కుక్కలను కట్టడి చేయాలి.

వామ్మో కుక్కకాట్లు..