
అంత్యక్రియలకు మాజీ మంత్రులు హాజరు
తిమ్మాజిపేట: మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ అంత్యక్రియలలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజలు పాల్గొని నివాళులర్పించారు. ఈనెల 1న హైదరాబాద్‌లో లక్ష్మారెడ్డి తల్లి మరణించారు. 2న విజయదశమి ఉండడంతో శుక్రవారం ఆయన స్వగ్రామం తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, పలువురు నాయకులు లక్ష్మమ్మ పాడె మోశారు. అంతకు ముందు మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, మోహనాచారి ఆవంచలో లక్ష్మారెడ్డిని పరామర్శించి ఆయన తల్లి అంత్యక్రియలలో పాల్గొని నివా ళుల ర్పించారు.