
బడులు ఏర్పాటు చేయాలి..
గత 20 సంవత్సరాలలో పాలమూరు చాలా విస్తరించింది. కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. కానీ, అక్కడ స్థానికంగా ఉండే వారి కోసం ప్రభుత్వ పాఠశాలలు లేవు. ఈ క్రమంలో చాలామంది పేద విద్యార్థుల తల్లిదండ్రలు ఫీజుల కట్టి తమ పిల్లలను ప్రైవేటుకు పంపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– రాఘవేందర్‌రెడ్డి, స్థానికుడు
ప్రైవేటుకే వెళ్లే పరిస్థితి..
షాసాబ్‌గుట్ట, మర్లు, బీకేరెడ్డికాలనీలు కొత్తగా ఏర్పడగా.. ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేదు. దీంతో ఇక్కడ చాలా వరకు ప్రైవేటు పాఠశాలలు వెలిశాయి. ఈ ప్రాంతాల్లో నివశిస్తున్న వారు 90 శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కొత్త కాలనీల్లో పాఠశాలలు ఏర్పాటు చేస్తే.. దూరం వెళ్లలేని చాలా మంది తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది.
– నరేష్, స్థానికుడు
మా దృష్టికి తీసుకువస్తే..
విద్యార్థులకు ఇబ్బంది ఉన్నచోట బడులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సమస్య ఎక్కడైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి. ఇటీవల నవాబ్‌పేటలో 2, హన్వాడలో ఒక పాఠశాల ఏర్పాటు చేశాం. జిల్లాకేంద్రంలోని కొత్త కాలనీల్లో కూడా ఇలాంటి సమస్య ఉంటే తప్పకుండా బడులు ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కడా ఇబ్బంది రాకుండా చూస్తాం.
– ప్రవీణ్‌కుమార్, డీఈఓ
●

బడులు ఏర్పాటు చేయాలి..

బడులు ఏర్పాటు చేయాలి..