
నాయకత్వం వహించాడు..
మా తండ్రి బెల్లం నాగన్న తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహించి నిజాం పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిజాం పాలనకు ఎదురుతిరిగాడు. అందుకు మా తండ్రిని పట్టుకోవడానికి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై కాల్పులకు పాల్పడటంతో 11 మంది వీరమరణం పొందారు. ఉద్యమ సమయంలో మాకున్న వంద ఎకరాల భూమిని మా తండ్రి అమ్మేశాడు.
– అంజన్న,
ఉద్యమకారుని కుమారుడు, అప్పంపల్లి
పోరాటంలో ఎంతో పాత్ర..
తెలంగాణ పోరాటంలో గ్రామ నాయకుల పాత్ర ఎంతో ఉంది. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన వీరులు బెల్లం నాగన్న, ఈడిగి బలరాంగౌడ్, తెలుగు ఆశన్న, దాసర్‌పల్లి బుచ్చారెడ్డి, ఆత్మకూర్ సంస్థానంపై జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో ఉద్యమకారులను పట్టుకోవడానికి పోలీసులు మా ఊరికి వచ్చారు. సాయంత్రం సమయంలో చూస్తుండగానే రావి చెట్టు కింద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గాయాలై అర్ధనాదాలు చేశారు.
– సాయిలు, రిటైర్డ్ టీచర్, అప్పంపల్లి

నాయకత్వం వహించాడు..