
కేసుల విచారణవేగవంతం చేయాలి
మహబూబ్‌నగర్ క్రైం: నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ పారదర్శక విచారణల ద్వారా శిక్షల శాతం పెంచాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో మంగళవారం నేరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టిసారించి ప్రతి కేసును లోతైన విచారణతో ముందుకు వెళ్లాలని సూచించారు. దీంతో నిందితులకు శిక్షలు పడేశాతం పెరగాలని ఆదేశించారు. గ్రేవ్, నాన్– గ్రేవ్, యూఐ కేసులు, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టిసారించి వాటి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టులలో కాంటెస్ట్‌డ్ కేసుల్లో స్థానికులను పకడ్బందీగా బ్రీఫ్ చేయాలని, బాధితులకు కేసుల పురోగతి తెలియజేయాలన్నారు. మహిళలపై నేరాలు జరగకుండా కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. దొంగతనాల కేసులను వేగంగా ఛేదించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని, సీసీ కెమెరాలతో నిఘా పెంచాలని, పనిచేయని సీసీకెమెరాలకు వెంటనే మరమ్మతు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అరెస్టులు, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు అప్పయ్య, గాంధీనాయక్, ఇజాజుద్దీన్, కమలాకర్, నాగార్జునగౌడ్, రామకృష్ణ, శ్రీనివాస్, భగవంతురెడ్డి, రత్నం తదితరులు పాల్గొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలు
పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరాతో మంగళవారం ఆయన చాంబర్‌లో 108 అంబులెన్స్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం అధికారి రవి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో ఉన్న 108, 102, పార్థివదేహం అంబులెన్స్ వాహనాల పనితీరు, వాటి వివరాలను వెల్లడించారు. గర్భిణులను పరీక్షల కోసం ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి ఉచితంగా 102 వాహనాల్లో తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. జనరల్ ఆస్పత్రిలో ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను సురక్షితంగా ఇళ్లకు చేర్చడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనాలు పనిచేస్తున్నాయని చెప్పారు. సమావేశంలో 108 జిల్లా కోఆర్డినేటర్ ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రజాపాలనదినోత్సవం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని బుధవారం ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌పై రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం మంత్రి సందేశాన్ని ఇస్తారు.
యువతకు నైపుణ్య శిక్షణ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రం రైల్వేస్టేషన్ సమీపంలోని టాస్క్ కేంద్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని రీజినల్ హెడ్ నవీన్‌రెడ్డి, జిల్లా మేనేజర్ సిరాజ్, రీజినల్ ఇన్‌చార్జ్ సతీష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లొమా చేసిన విద్యార్థులకు ప్రోగ్రామింగ్ స్కిల్స్, సీ లాంగ్వేజ్, జావా ఫండమెంటల్స్, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్‌ఎస్, పైథాన్ ప్రోగ్రామింగ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్, డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 20లోగా టాస్క్ సెంటర్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

కేసుల విచారణవేగవంతం చేయాలి