
సమతుల ఆహారంతో ఆరోగ్యం
● నేటి నుంచి పోషణ్ అభియాన్ మాసోత్సవం
● మాతాశిశు సంరక్షణపై ప్రభుత్వం దృష్టి
● నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు
● పథకాల సద్వినియోగంపై అవగాహన
ఐసీడీఎస్
ప్రాజెక్టులు
4
అంగన్‌వాడీ కేంద్రాలు
1,184
చిన్నారులు
57,379
బాలింతలు
7,792
గర్భిణులు
6,741
మహబూబ్‌నగర్ రూరల్: మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టిసారించింది. ఇందుకోసం ప్రతి సంవత్సరం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిశీలనకు పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా మాసోత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా బుధవారం నుంచి వచ్చేనెల 16 వరకు సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై సూచనలు ఇవ్వడంతో పాటు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు అంచనా వేస్తుంటారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తుంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు ఆరోగ్యంపై సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఏటా మాదిరిగానే ఈసారి కూడా నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ మాసోత్సవాలు పండుగ వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
ఇవీ కార్యక్రమాలు..
మొదటి వారంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పాలిచ్చే తల్లులతో పిల్లల పోషణపై సలహా సమావేశం ఉంటుంది. మహిళలతోపాటు పురుషులకు వంటల పోటీలు నిర్వహిస్తారు. బాలికలు, మహిళలకు బీఎంఐ పరీక్షలు, పిల్లల బరువు, ఎత్తు కొలిచి పోషకాహారంపై ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయిస్తారు. స్థానిక ఉత్పత్తుల గురించి అవగాహన కల్పిస్తారు.
రెండో వారంలో భాగంగా బిడ్డకు అందించే ముర్రుపాల విశిష్టత, అనుబంధ ఆహారంతోపాటు ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తారు. పోషణలో తండ్రుల భాగస్వామ్యం, బిడ్డ మొదటి వెయ్యి రోజుల్లో మెదడు అభివృద్ధి గురించి వివరిస్తారు.
మూడో వారంలో భాగంగా అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలకు ఆకలి పరీక్షలు నిర్వహిస్తారు. గ్రోత్ మానిటరింగ్‌లో హాజరుకాని పిల్లల బరువు, ఎత్తు కొలుస్తారు. పోషణ లోపం ఉన్న పిల్లల ఇళ్లకు ఆశాలు వెళ్లి వివరాలను సేకరిస్తారు.
నాలుగో వారంలో మంచినీరు, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, తక్కువ చక్కెర, నూనెలతో తయారు చేసే వంటకాలను ప్రదర్శిస్తారు. ప్లాస్టిక్ సంచులు, వ్యర్థాల నిర్వహణ గురించి వివరిస్తారు. పాఠశాలల్లో వ్యాసరచన, క్రీడా, బాలికలకు రక్తహీనత పోటీలు పెట్టి బహుమ పరీక్షల నిర్వహణ, బహుమతులు అందజేస్తారు. కిచెన్ క్రమ పరిశుభ్రత, గార్డెన్ల ఏర్పాటు, కిశోర బాలికలకు అవగాహన కల్పిస్తారు.
జిల్లా పరిధిలో ఇలా..

సమతుల ఆహారంతో ఆరోగ్యం