
కలానికి సంకెళ్లుఅప్రజాస్వామికం
ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో పత్రికలపై అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవాలనుకోవడం సిగ్గుమాలిన చర్య. 30 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకొనే చంద్రబాబు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్‌గా నిలిచి.. ప్రజాగొంతుకను వినిపించే పత్రికలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించడం కలానికి సంకెళ్లు వేయడమే. దీనిని ప్రతిఒక్క ప్రజాస్వామికవాది ఖండించాలి. ఇప్పటికై నా చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛనుకాపాడాలి.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల