
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో రైతు లు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపర్లు ఇలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు లు ఇతర శాఖల సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా చెరువులు, వాగులు, రోడ్లపై నీరుపారే చోట్ల ప్రత్యే క దృష్టి పెట్టాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయరాదని, విద్యుత్ స్తంభాలు ఇతర పరికరాల ముట్టుకోవద్దని, ఏదై నా సమస్య ఉంటే విద్యుత్ అధికారులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వరద ముప్పు ఉన్న గ్రామాలు, పాత మట్టి ఇళ్లు ఉన్న గ్రామాల్లో పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి పర్యవేక్షించాలన్నారు. రహదారులపై ఉధృతంగా నీరు ప్రవహిస్తుంటే అలాంటి చోట్ల రోడ్డు దాటరాదని, పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేయాలన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే డయల్ 100, లేదా పోలీస్ కంట్రోల్‌రూం 87126 59360కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
14న జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 14వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.శాంతికుమార్, కురుమూర్తిగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్‌కార్డుతో హాజరుకావాలని కోరారు. ఎంపికయ్యే క్రీడాకారులు నిజామాబాద్‌లో ఈ నెల 25 నుంచి 28 వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనాల్సి ఉందని తెలిపారు. మిగతా వివరాల కోసం 9491489852 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
డీవైఎస్‌ఓ బదిలీ
● కొత్త డీవైఎస్‌ఓగా ప్రశాంత్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ బదిలీ అయ్యారు. 2019 డిసెంబర్‌లో విధుల్లో చేరిన ఆయన ఆరేళ్లుగా మహబూబ్‌నగర్ జిల్లా డీవైఎస్‌ఓగా పనిచేసి హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హెడ్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో బాస్కెట్‌బాల్ కోచ్ కె.ప్రశాంత్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర క్రీడాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో కొత్త డీవైఎస్‌ఓ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎన్‌ఎంఎంఎస్‌స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చేనెల 6వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని, పరీక్షను నవంబర్ 23వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఎంఈఓలు, హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాకు చేరిన
ఎన్నికల సామగ్రి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది. అందులో భాగంగా ఇటీవల సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఈ క్రమంలో జిల్లాకు ఎన్నికల సామగ్రి కూడా చేరింది. ఇందులో ఎన్నికలకు ఉపయోగించే 54 రకాల వస్తువులు ఉన్నాయి. పెన్ను, పెన్సిల్, ఇంక్ ప్యాడ్, స్కేల్, కాటన్, లక్క, స్టాప్లర్, చేయి సంచీ ఇలా 54 రకాల ఎన్నికల సామగ్రి ఉన్నాయి. సూపరింటెండెంట్ శ్రీహరి, సెక్షన్ అధికారి విజయ్‌భాస్కర్ సమక్షంలో సామగ్రిని పరిశీలించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో భద్ర పరిచారు. జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి వచ్చిన ఎన్నికల సామగ్రిని పరిశీలించి...చాలా జాగ్రత్తగా భద్రపరచాలని అధికారులకు సూచించారు. కాగా.. ఇదివరకే సర్పంచ్ ఎన్నికల సామగ్రి జిల్లాకు చేరుకుంది.

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి