
ప్రమాదం పొంచి ఉంది
సమీపంలోని ఎర్రకుంట చాలావరకు పూడుకపోయింది. సగం వర కు కట్టను అధికారులు మరమ్మతు చేయించారు. మిగతా భాగం అలాగే వదిలేశారు. పైనుంచి వరద ఉద్ధృతంగా వచ్చి ఈ కుంట తెగితే మా కాలనీలోని చాలా ఇళ్లు జలమయమవుతాయి. రైల్వేట్రాక్ వైపు ఉన్న తూమును మూసివేయడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్ల మధ్యలో నుంచి గణేష్‌నగర్ వైపు వెళ్తున్న పెద్దకాల్వ ప్రస్తుతం నిండుగా పారుతోంది. ఈ కాల్వను వెంటనే విస్తరించాలి.
– ఎన్.నరేష్‌కుమార్,
గణేష్‌నగర్, మహబూబ్‌నగర్
అన్ని జాగ్రత్తలుతీసుకుంటున్నాం
ఇటీవలి భారీ వర్షాలకు నగరంలోని ఐదు చెరువులు, కుంటలు నిండాయి. మా సిబ్బంది తరచూ నీటివనరుల వద్దకు వెళ్లి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో అన్ని చోట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సీజన్ ఆరంభం నుంచే పెద్దచెరువు, ఎర్రకుంట, ఇమాంసాబ్‌కుంటల తూములను తెరిచి వరదను బయటకు వదులుతున్నాం.
– వెంకటయ్య,
ఈఈ, నీటిపారుదలశాఖ
●