
వచ్చేనెల 16న పీయూ స్నాతకోత్సవం
● హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
● పనులను పరిశీలించిన వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ నాలుగోవ స్నాతకోత్సవానికి వచ్చే నెల 16 తేదీన నిర్వహించనున్నారు. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. గురువారం వీసీ శ్రీనివాస్ పీయూ లైబ్రరీ సెంట్రల్ హాల్‌లో నిర్వహించే స్నాతకోత్సవ వేడుక పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానం హాల్‌లో వేదికను మరింత పెద్దదిగా చేయించనున్నారు. అలాగే హాల్‌లో ఇటీవల చేసిన పలు మరమ్మతు పనులతో పాటు మరుగుదొడ్లు, ఇతర ఎలక్ట్రీషియన్ పనులను ఆయన పరిశీలించారు. స్నాతకోత్సవానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి లోటు పాట్లు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వివిధ కమిటీల అధ్యాపకులకు ఆయన సూచించారు. వీసీ వెంట రిజిస్ట్రార్ రమేష్‌బాబు, కంట్రోలర్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, అనురాధారెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ కుమారస్వామి, సీనియర్ అధ్యాపకులు నూర్జహాన్, రాజ్‌కుమార్, జయనాయక్, రజిని, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.