
యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి
పెద్దకొత్తపల్లి: రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలలో విత్తనోత్పత్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, తమ వ్యవసాయ క్షేత్రాలలో నాణ్యమై న విత్తనాలు ఎంచుకొని వాటి ద్వారా విత్తనోత్పత్తిని సాధించుకోవచ్చని పాలెం వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్ అన్నారు. గురువారం మండల కేంద్రం పెద్దకొత్తపల్లిలో వరి, జొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం అందించిన వరి, జొన్న, కంది విత్తనాలను రైతులు వేసిన పంటలను వ్యవసాయ అధికారి శిరీషతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో సూక్ష్మదాతు లోపం నివారణకు ఫారుమాల్–4ను 250 గ్రాము లు ఎకరాకు, కొనలు ఎర్రగా మారినందుకు సాప్ 450 మి.లీ. ఎకరాకు, కాండం తొలుచు పురు గు నివారణకు కాంట్రాక్టు 450 గ్రాములు ఎకరాకు పిచికారీ చేసుకోవాలని ఆయన సూచించారు. కా ర్యక్రమంలో ఏఈఓలు ముజీబ్, జానకీరామ్, మల్లేష్, రైతులు చెన్నమ్మ, రాములు పాల్గొన్నారు.