క్యాటరింగ్‌ వృత్తి.. చోరీలు ప్రవృత్తి | - | Sakshi
Sakshi News home page

క్యాటరింగ్‌ వృత్తి.. చోరీలు ప్రవృత్తి

Sep 12 2025 6:48 AM | Updated on Sep 12 2025 6:48 AM

క్యాటరింగ్‌ వృత్తి.. చోరీలు ప్రవృత్తి

క్యాటరింగ్‌ వృత్తి.. చోరీలు ప్రవృత్తి

ఈజీ మనీ కోసం పశువుల అపహరణ

పలుల జిల్లాలో అపహరించిన గ్యాంగ్‌

క్యాటరింగ్‌ చేస్తూ ముఠాగా మారిన వైనం

తొమ్మిది రోజుల్లో పట్టుకున్న పోలీసులు

నవాబుపేట: జీవనోపాధికి క్యాటరింగ్‌ పనులు చేస్తూ హైదరాబాద్‌లో కలిసిన వారంత ఈజీమనీకి అలవాటు పడ్డారు. గ్యాంగ్‌గా మారి పగలు పని చేసుకుంటూ మారుమూల ప్రాంతాలను ఎంచుకొని ప్రధానంగా ఆవులు చోరీ చేసి విక్రయించే వారు. పాడి ఆవులకు డిమాండ్‌ ఉండటంతో వాటి ని అపహరించటం విక్రయించటం వృత్తిగా ఎంచుకొని నేరాలను విస్తరించినట్లు ఎస్పీ జానకి తెలిపారు. రాష్ట్రంలో పలు జిల్లాలో వరుస చోరీలు చేస్తూ పట్టుబడిన నిందితులకు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

క్యాటరింగ్‌ పనులకు వెళ్లి

జిల్లాలోని మహ్మదబాద్‌ మండలం జూలపల్లికి చెందిన కుమ్మరి అశోక్‌, కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌కు చెందిన అఖిల్‌, నల్లగొండ జిల్లా గుంతకల్‌ మండలం ముకుందాపూర్‌కు చెందిన సాయికుమార్‌, వరంగల్‌ జిల్లా జనగామ మండలం పాకాలకు చెందిన బుర్కసాయి హైదరాబాద్‌లో క్యాటరింగ్‌ పనులకు వెళ్తూ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. ఒకేసారి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని ఆవులు, ఇతర పశువు లు చోరీ చేసి విక్రయించాలని నిర్ణయించుకొని చో రీలు ప్రారంభించారు. కాగా ఈ గ్యాంగ్‌ వికారా బాద్‌, రంగారెడ్డి, మమాబూబ్‌నగర్‌, యాదగిరిగు ట్ట, సైబరాబాద్‌ తదితర జిల్లాలోని ప్రాంతాల్లో ఆ వులను చోరీ చేసి విక్రయించారు. చోరీ చేసిన ఆవు ల్లో రూ.లక్ష రూపాయలకు పైగా విలువ చేసే ఆవులతో పాటు దాదాపుగా రూ.14.50 లక్షల విలు వైన పశువులు చోరీ చేసినట్లు ఎస్పీ వివరించారు.

సీసీ కెమెరాలే పట్టించాయి

ఈ నెల 2న మండల పరిధిలోని మరికల్‌ గ్రామంలో రెండు ఆవులు చోరీ చేసినట్లు బాధితుడు పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేయగా కూపీ లాగితే డొంక మొత్తం కదిలి అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టయిందని ఎస్పీ తెలిపారు. చోరీ చేసిన ఆవులను వారు తరలించే బొలెరో వా హనం నంబర్‌ ప్లేట్‌ తరుచూ మారుస్తూ చోరీలకు పాల్పడిందని, చోరీ చేసిన ప్రాంతం సమీపంలోనే పోలీసులకు చిక్కినట్లు ఆమె తెలియజేశారు.

పోలీసులకు రివార్డులు

కేవలం 9 రోజుల వ్యవధిలో అంతర్రాష్ట్ర పశువుల ముఠాను పట్టుకొని కేసును చేధించిన నవాబుపేట ఎస్‌ఐ విక్రమ్‌, ఏఎస్‌ఐ జనార్ధన్‌, సిబ్బంది వెంకట్రా ములు, సురేష్‌బాబు, భాస్కర్‌, శెట్టినాయక్‌ను ఎస్పీ రివార్డులు అందజేసి అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement