
అటవీ సిబ్బంది సేవలు అభినందనీయం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: అడవులు, వన్యప్రాణు ల సంరక్షణ కోసం అటవీ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువా రం జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. జిల్లాలో విస్తారమైన అడవులు ఉండటంతో చిరుతల సంఖ్య పెరిగిందన్నారు. కొన్ని రోజులుగా జనావాసాల్లోకి సైతం వస్తున్నాయన్నా రు. ఈ క్రమంలో వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అటవీ సిబ్బంది చర్యలు చేపట్టాల ని సూచించారు. విధి ని ర్వహణలో ఎంతో మంది అటవీ సిబ్బంది ప్రాణా లు కోల్పోతున్నారని.. వారి సేవలు చిరస్మరణీయ మన్నారు. అటవీశాఖ అధికారులతోనే టూరిజం శాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. ఎకో టూరిజాన్ని ప్రచారం చేయడంలో అటవీశాఖ పాత్ర గొప్పదని అన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అని త, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, ఎఫ్‌డీఓ గణేశ్, ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ హాయ్, కమాలుద్దీన్, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో అటవీ సిబ్బంది బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు.