
అనుమానాస్పదంగా యువకుడి మృతి
● అమ్మాయితో చనువు వల్లే
దాడి చేశారని ఆరోపణ
● డీఎస్పీకి ఫిర్యాదు
మహబూబ్‌నగర్ క్రైం: ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న యువకుడు తీవ్రగాయాలతో అనుమానాస్పదంగా ఉరి వేసుకొని మృతి చెందిన ఘట న కలకలం రేపుతోంది. మండల పరిధిలోని మాచన్‌పల్లి గ్రామానికి చెందిన దర్పల్లి వెంకటేష్(23) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని భావించిన సదరు అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ నెల 8వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో వెంకటేష్ ఇంటికి వచ్చి మా అమ్మాయి కన్పించడం లేదని అతడిని ఆటోలో తీసుకెళ్లారు. ఊరు శివారులో దాడి చేసి గాయపరిచారు. అప్పటికే అమ్మాయి ఇంటి వద్దే ఉన్నట్లు సమాచారం రావడంతో వెంకటేష్‌ను వదిలి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న మాచన్‌పల్లి శివారులోని పంట పొలంలోని చింతచెట్టుకు వెంకటేష్ ఉరి వేసుకొని ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వెంకటేష్ మృతదేహన్ని పరిశీలించి శరీరంపై తీవ్రంగా రక్తగాయాలు ఉన్నట్లు గు ర్తించారు. మృతదేహం జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉండగా గురువారం మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, ముదిరాజ్ కులసంఘాల నాయకులు డీఎస్పీ వెంకటేశ్వర్లును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మృతుడి తండ్రి దర్పల్లి పెంటయ్య రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేశాడు. అమ్మాయి తరుఫు వాళ్లు వెంకటేష్‌పై దాడి చేశారని, వెంకటేష్ మృతిపై అనుమానం ఉందని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ సాగుతుందని డీఎస్పీ పేర్కొన్నారు.

అనుమానాస్పదంగా యువకుడి మృతి