
కామారెడ్డి జిల్లాలో మరికల్ గొర్రెల కాపరి మృతి
మరికల్: కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పరిధిలోని జాతీయ ర హదారిపై గొర్రెల మందతో పాటు ఇద్దరి కాపరులను లారీ ఢీకొట్టిన ఘటనలో మరికల్‌కు చెందిన ఓ కాపరి మృతి చెందా డు. బాధిత కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. మరికల్‌కు చెందిన కాపరులు మేత కోసం గొర్రెల ను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో ఉన్న అడవులకు తీసుకెళ్లారు. తిరిగి బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చేందుకు గొర్రెల మందతో పాటు ఇద్దరు కాపరులు గుడిగండ్ల రామప్ప, బసయ్యపల్లి మల్లేష్ వస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల సమీపంలో ఎరుదుగా వచ్చిన లారీ గొర్రెల మందతో పాటు ఇద్దరి కాపరులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుడిగండ్ల రామప్ప (56) అక్కడిక్కడే మృతి చెందగా.. 26 గొర్రెలు మృత్యువాత పడ్డా యి. గాయపడిన మల్లేష్ కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మరికల్‌లో ని బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎంట్రెన్స్ కోసం ఉచిత శిక్షణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు జాతీయస్థాయిలో నిర్వహించే ఐఐటీ, డిగ్రీ విద్యార్థులకు సెట్, పీజీ ఎంట్రెన్స్ కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు ఆన్‌లైన్ విధానంలో ఫెర్మాట్ ఎడ్యుకేషన్ ఆకాడమీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ మధు మోటమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో శిక్షణ పొందిన వారు అనేక ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణత సాధించారని, ఆసక్తి గల రు 97012 75354, 91337 05933 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
అతిథి అధ్యాపకుల కోసం..
జడ్చర్ల టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డా.బీఆర్‌ఆర్ డిగ్రి కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.సుకన్య ఓ ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు అర్హులైన వారు శుక్రవారం సాయంత్రం లోగా దరఖాస్తులు చేసుకోవాలని, 15వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.