
పిల్లల విషయంలోబాధ్యతగా ఉండాలి
పాలమూరు: బాలభవన్‌లో రక్షణ పొందుతున్న పిల్లల తల్లిదండ్రులు భిన్నమైన మానసిక స్థితిలో ఉన్నారని, వారందరూ మద్యానికి బానిసలుగా మారినట్లు గుర్తించామని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలో ఉన్న బాలభవన్‌ను బుధవారం న్యాయమూర్తి సందర్శించి ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పిల్లల క్షేమం కోసం మద్యం అలవాటు ఉన్న తల్లిదండ్రులను వారిని డీ–అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తామన్నారు.
● జిల్లాకేంద్రంలోని శ్రద్ధ జూనియర్ కళాశాలలో బుధవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర హాజరై చట్టాలపై అవగాహన కల్పించారు. బాలల హక్కులు, చట్టాలు, బాల్య వివాహాలు, విద్య హక్కు చట్టం, పోక్సో చట్టం, బాలల సంరక్షణ, సైబర్ నేరాలు వంటి చట్టాలపై విద్యార్థులకు అవగాహన చేశారు. విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సైబర్ క్రైం ఎస్‌ఐ శ్రవణ్‌కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మిషన్ భగీరథ నీళ్లు
36 గంటలు బంద్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఈ నెల 11వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు 36 గంటల పాటు మిషన్ భగీరథ నీళ్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు భగీరథ గ్రిడ్ ఈఈ శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని క్రిష్టియన్‌పల్లి చించోళి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 1200 ఎంఎం పైప్‌లైన్‌ను మార్చడంతో ఈ అంతరాయం ఏర్పడనున్న ట్లు పేర్కొన్నారు. దీంతో మహబూబ్‌నగర్ నగరానికి పాక్షికంగా, మన్యంకొండ నీటి శుద్ధీకరణ ప్లాంట్ నుంచి సరఫరా అయ్యే మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని 258 గ్రామాలతో పాటు నారాయణపేట, మక్తల్, దేవరకద్ర మున్సిపాలిటీలకు పూర్తిగా నీళ్ల సరఫరా నిలిచిపోనున్నట్లు తెలిపారు.