
మార్కెట్‌లోకి హోండా సీబీ 125 హార్నెట్
పాలమూరు: హోండా కంపెనీ నుంచి మార్కెట్‌లోకి మరో రెండు నూతన మోడల్ ద్విచక్ర వాహనాలను విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని నర్మదా హోం షోరూంలో బుధవారం హోండా సీబీ 125 హర్నెట్, హోండా షైనీ 100డీఎక్స్ ద్విచక్ర వాహనాలను ఆర్టీఓ రఘుకుమార్, నర్మద హోండా ఎండీ వేణుగోపాల్‌సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్పోర్ట్స్ బైక్ ప్రేమికుల కోసం హోండా సీబీ 125 హర్నెట్ అద్భుతంగా ఉంటుందని, ఐదు గేర్లు, సైలెంట్ స్టార్ట్ ఏసీజీ, 4.2అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్, ఎస్‌ఎంఎస్ అలర్ట్స్, నావిగేషన్ సదుపాయం ఉందన్నారు. యూఎస్‌బీ ఛార్జింగ్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు ఇన్‌బిల్ట్‌గా వస్తాయన్నారు. షోరూం ధర రూ.1.12లక్షలు ఉండగా ఆన్‌రోడ్ ధర రూ.1,36,495లకు లభిస్తుందన్నారు. ఇక హోండా షైనీ 100డీఎక్స్ ఫ్యామిలీ వినియోగదారులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇస్తూ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోందని, 4 స్ట్రోక్ ఇంజిన్, 4 స్పీడ్ గేర్ బాక్స్, ఓబీడీ–2బీ కంప్‌లైంట్, డిజిటల్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజిన్‌కట్ ఆఫ్ ఉంటుందన్నారు. షోరూం ధర రూ.75,950 ఉండగా ఆన్‌రోడ్ ధర రూ.92,172లకు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ బాలీశ్వర్‌రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.