
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
● అధికంగా కేసులు రాజీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి
● ఇన్‌చార్జి న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి
పాలమూరు: జిల్లా కోర్టుతో పాటు జడ్చర్లలో ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కోసం ప్రత్యేకంగా 8 బెంచీలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కోర్టు ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయమూర్తి చాంబర్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 1,748 కేసులు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు కోర్టు ఎదుటకు రాని కేసులు పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి కేసు రాజీ చేసుకోవాలన్నారు. క్రిమినల్, సివిల్, రోడ్డు ప్రమాదాల కేసులు, చిట్‌ఫండ్, విద్యుత్, డ్రంకన్‌డ్రైవ్, చెక్‌బౌన్స్, బ్యాంకు కేసులు ఇలా అన్ని రకాల కేసులు కక్షిదారులు రాజీ చేసుకోవాలని సూచించారు. పోలీస్‌శాఖతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకు మేనేజర్లు ప్రత్యేక దృష్టి పెట్టి లోక్ అదాలత్‌కు అధికంగా కేసు లు వచ్చే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు.
వివరాలు వెల్లడిస్తున్న న్యాయమూర్తికల్యాణ్ చక్రవర్తి