
వంతుల వారీగా క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నా..
మూడెకరాల్లో వరి, జొన్న పంటలు సాగు చేశాను. యూరియా కోసం తిరగని చోటు లేదు.. సొసైటీ కాడా యూరియా ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా దొరకలేదు. సొసైటీ వద్ద తెల్లవారుజాము నుంచి పడికాపులు కాసినా ఇవ్వలేదు. అధికారులు రేపుమాపు అని తిప్పుతున్నారు. వరినారు ముదిరిపోయింది. జొన్న పంట ఆశించినంతగా కాత కాయడం లేదు. చేసేది లేక భార్యాభర్తలం వంతుల వారీగా రైతు సొసైటీ వద్ద క్యూలైన్‌లో పడిగాపులు కాసి వస్తున్నాం.
– లొడ్డ వెంకట్రాములు, సల్లోనిపల్లి, హన్వాడ మండలం