
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి
● స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌శివేంద్రప్రతాప్
● ముగిసిన ‘100 రోజుల ప్రత్యేక కార్యాచరణ’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరాన్ని అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ సూచించారు. జూన్ 1 నుంచి చేపట్టిన ‘100 రోజుల ప్రత్యేక కార్యాచరణ’ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వంద రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులు ఎంతగానో శ్రమించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సుమారు 150 మంది కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్ రెడ్డి, మేనేజర్ వెంకటేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు లక్ష్మయ్య, శ్రీనివాస్‌జీ తదితరులు పాల్గొన్నారు.