
మనకు మనమే పోటీ
విద్యార్థులు, రైతులు, యువకులు ఎవరికై నా మానసిక ఒత్తిడి పెరిగిన సందర్భంలో న్యూరో ట్రాన్స్‌మీటర్స్ దెబ్బతిని ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. అనుకున్న స్థాయికి రీచ్ కాలేకపోయిన క్రమంలో బాధ, దుఖంలో ఆసక్తి లోపిస్తాయి. చుట్టూ ఉండే వాతావరణం, ఇతరులతో పోలిక వంటి వాటి కారణంగా విద్యార్థులు ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు వారిని అసవరమైన మేర ప్రోత్సహించాలి. చదువు విషయంలో ప్రణాళిక, సమయపాలన ఎంతో ముఖ్యం. కష్టమైన సబ్జెక్టు ఉంటే ప్రతి రోజూ సాధన చేయాలి. మెదడుకు చదువుపై ప్రణాళికబద్ధమైన అలవాటు చేయాలి. చదువుకునే సమయంలో సెల్‌ఫోన్, టీవీలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పూర్తి ధ్యాసంతా పుస్తకాలపైనే ఉంచాలి.
– డాక్టర్ భార్గవ స్వరాజ్, మానసిక వైద్య నిపుణుడు