
రీజినల్ రింగ్ రోడ్డు డిజైన్ మార్చాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బాలానగర్ మండలం గుండా వెళుతున్న రీజినల్ రింగ్ రోడ్డు డిజైన్ మార్చాలని భూమూలు కోల్పోతున్న రైతులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రకటించిన సర్వే నెంబర్లలో భూములు పేద దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందినవే ఉన్నాయని, అందులో ఎకరం, రెండు ఎకరాల ఉన్న రైతులు సర్వస్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ డిజైన్ మార్చి పేద రైతుల బతుకుల్లో వెలుగులు నింపాలని కోరారు. ప్రభుత్వం మొండిగా అదే సర్వే నంబర్లలోని భూములను తీసుకుంటామంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం చేసిన రీజినల్ రింగ్‌రోడ్డు అలైనమెంట్‌ను యథావిధిగా అమలు చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్‌కు వినతిపత్రంఅందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు దీప్లానాయక్, రైతులు కృష్ణయ్యర సోమ్లానాయక్, రవి, యాదయ్య, ఎనిమిది గ్రామాల రైతులు పాల్గొన్నారు.