
ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక స్థానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక స్థానం ఉందని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయి అధ్యాపక అవార్డును పొందిన పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డికి సోమవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సమాజంలో అన్ని వృత్తుల వారిని తయారు చేసే ఏకై క వృత్తి ఉపాధ్యాయ వృత్తన్నారు. అనంతరం మధుసూదన్‌రెడ్డిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ప్రిన్సిపాళ్లు కరుణాకర్‌రెడ్డి, రవికాంత్, పీడీ శ్రీనివాస్, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.