
‘వంద కవులు–ఐదొందల మొగ్గలు’ పుస్తకావిష్కరణ
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రపంచా కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని వందమంది కవులు రాసిన ఐదొందలు మొగ్గలు పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని బిర్లా ప్లాంటోరియల్‌లోని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్రప్రదేశ్ జానపద అకాడమీ, అధికారభాషా సంఘం మాజీ చైర్మన్ పొట్లూరి హరికృష్ణ సంపాదకత్వంలో రూపొందిన ‘వంద కవులు–ఐదొందల మొగ్గలు’ పుస్తకాన్ని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి, పాలమూరు సాహితీ అధ్యక్షుడు, మొగ్గలు ప్రక్రియ రూపకర్త డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కవులకు కాళోజీ పురస్కారాలు
తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజీ జయంతి సందర్భంగా పాలమూరు జిల్లా కవులకు ఆర్ట్ ఫౌండేషన్ కాళోజీ పురస్కారాలను అందజేశారు. జిల్లాకు చెందిన కవులు కోట్ల వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్‌కు ఆదివారం హైదరాబాద్‌లోని బిర్లా ప్లాంటోరియం ఆడిటోరియంలో మెమెంటో, శాలువాతో సత్కరించారు.