
మృతదేహంతో బైఠాయింపు
బల్మూర్: మండలంలోని బాణాలలో ఈనెల 4న ఆత్మహత్యకు పాల్పడిన సంపంగి పార్వతమ్మ మృతి ఘటనకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మృతురాలి కుటుంబ సభ్యులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బాణాలకు చెందిన పార్వతమ్మకు మూడేళ్ల నుంచి అదే గ్రామానికి చెందిన శరత్‌తో వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. గురువారం భర్త నరేశ్ ఇద్దరు కలిసి ఉండటాన్ని గమనించి నిలదీయగా.. శరత్ పారిపోవడంతో పార్వతమ్మ పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈనెల 5న మృతి చెందింది. పార్వతమ్మ మృతికి కారణమైన శరత్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బాణాలలో మృతదేహంతో శరత్ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అచ్చంపేట సీఐ నాగరాజ్, బల్మూర్ ఎస్‌ఐ రాజేందర్, లింగాల ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్‌లు బాణాల గ్రామంలో బంధోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఆవాంచనియ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబసభ్యులకు హమీ ఇవ్వడంతోవారు శాంతించారు.