
శ్రీశైలం రహదారిలో ట్రాఫిక్ జామ్
దోమలపెంట: శ్రీశైలం రహదారిపై శనివారం వాహనాల రద్దీ పెరిగింది. దోమలపెంట నుంచి శ్రీశైలం వరకు వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మరోవైపు ఈగలపెంట సమీపంలో ఓ బస్సు ముందు టైర్లు పంక్చర్ కావడంతో రోడ్డుపైనే నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలన్నీ స్తంభించిపోయాయి. ఈగలపెంట ఎస్‌ఐ అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించారు. 10 నిమిషాలు పైకి వచ్చే వాహనాలకు, మరో 10 నిమిషాలు దిగువకు వెళ్లే వాహనాలకు అనుమతులిచ్చారు. కానీ ముందుగానే బస్సు వెనుక భాగం నుంచి దోమలపెంట వరకు వాహనాలు నిలిచి ఉండటం.. మరోవైపు శ్రీశైలం దేవస్థానం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు బారులు తీరారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి సుమారు 4గంటల సమయం పట్టింది.
తప్పిన ప్రమాదం..
హైదరాబాద్ నుంచి శ్రీశైల క్షేత్రం వెళ్తున్న పికెట్ డిపోకు చెందిన ఆర్టీసి బస్సుకు ప్రమాదం తప్పింది. ఈగలపెంట వద్ద ప్రయాణిస్తున్న బస్సు ముందు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. బస్సు డ్రైవర్ యాదగిరి చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మరో 100మీటర్ల దూరంలో ఘాట్‌రోడ్డు ఉండటం.. ఆ ప్రాంతంలో బస్సు టైర్లు పేలి ఉంటే పెను ప్రమాదం జరిగేది. బస్సులోని ప్రయాణికుల మరో బస్సులో శ్రీశైలం బయల్దేరి వెళ్లారు.

శ్రీశైలం రహదారిలో ట్రాఫిక్ జామ్