
మార్కెట్‌లోకి రెనాల్ట్ కిగర్ టర్పో
పాలమూరు: రెనాల్ట్ కంపెనీ నుంచి మరో న్యూ మోడల్ కారు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని యుక్తా మోటార్స్‌లో శనివారం రెనాల్ట్ కిగర్ టర్పో కారును కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మాధురి, ట్రెండ్ గ్రూప్ ఎండీ గట్టు శ్రీహర్షిత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. నూతన టర్పోలో ఎనర్జీ ఇంజిన్ కలిగి.. సరికొత్త భద్రతా ప్రమాణాలతో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయని తెలిపారు. క్రూజ్ కంట్రోల్ సిస్టంతో గ్రామీణ రోడ్లపై అనుకూలంగా వెళ్తుందన్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి.. మల్టీవ్యూ కెమెరా, ఆటో హెడ్‌ల్యాంప్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయని తెలిపారు. 40.64 సెంటీమీటర్ల డైమండ్ కట్ అలాయ్ వీల్స్‌తో ఆరు రంగుల్లో పెట్రోల్ వెర్షన్‌తో అందుబాటులో ఉందన్నారు. లీటర్ 20.38 కి.మీ. మైలేజ్ ఇస్తోందని తెలిపారు. ఎక్స్‌షోరూం ధర రూ. 6.29లక్షలు ఉందన్నారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రమేశ్, సర్వీస్ మేనేజర్ సందీప్ పాల్గొన్నారు.