నిమజ్జనం చేసి వస్తుండగా..అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనం చేసి వస్తుండగా..అపశ్రుతి

Sep 6 2025 7:41 AM | Updated on Sep 6 2025 7:41 AM

నిమజ్

నిమజ్జనం చేసి వస్తుండగా..అపశ్రుతి

జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను వేగంగా ఢీకొన్న డీసీఎం

అర్ధరాత్రి పెబ్బేర్‌ మండలం రంగాపురం వద్ద ప్రమాద ఘటన

ఒకే గ్రామానికి చెందిన ఇద్దరి దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం

● వనపర్తి మండలం నాచహళ్లిలో మిన్నంటిన కుటుంబ సభ్యుల రోధనలు

గ్రామంలో విషాదఛాయలు

వినాయకుడి నిమజ్ఙనంలో అపశృతి చోటు చేసుకొని గ్రామంలో ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బోయ శ్రీనివాసులు, భార్య మొగులమ్మకు సాయితేజ ఒక్కరే సంతానం కావడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో వారి రోధనలు మిన్నంటాయి. సాయితేజకు వివాహమై భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. గోవిందుకు ముగ్గురు కుమారులుండగా.. రెండో కుమారుడైన శంకర్‌ మృతితో కుటుంబం, బంధువుల రోధనలు పలువురిని కంటతడి పెట్టించాయి. శంకర్‌కు వివాహం కాలేదు.

వనపర్తి రూరల్‌: కృష్ణానదిలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసి ట్రాక్టర్‌పై వస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వస్తున్న డీసీఎం ఢీకొట్టడంతో అక్కడిక్కడే ఇద్దరు దుర్మరణం చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా కాగా.. నలుగురికి గాయాలైన ఘటన పెబ్బేరు మండలం రంగాపురం జాతీయ రహదారిపై శక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పెబ్బేరు ఎస్‌ఐ యుగేంధర్‌రెడ్డి కథనం ప్రకారం.. వనపర్తి మండలం నాచహళ్లికి చెందిన సాయితేజ(25), శంకర్‌(26) అదే గ్రామానికి చెందిన ఎనిమిది మందితో కలిసి గ్రామంలోని కాలనీలో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్ఙనం చేయడానికి ట్రాక్టర్‌లో బయలుదేరారు. నదిలో వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా రంగాపురం శివారులోని జాతీయ రహదారిపై వస్తుండగా అనంతపూర్‌ జిల్లా నుంచి టమోటా లోడుతో హైదరాబాద్‌ వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. డ్రైవర్‌ నరేశ్‌, సాయితేజ, శంకర్‌, విష్ణు, అబ్దుల్లా ముందుభాగంలో కూర్చోగా.. మిగతా వారు ట్రాలీలో కూర్చున్నారు. ముందుభాగంలో కూర్చున్న సాయికృష్ణ, శంకర్‌, డీసీఎం కింద పడడంతో అక్కడిక్కడే మృతిచెందారు. విష్ణు, అబ్దుల్లా రోడ్డుపై పక్కకు పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇంజన్‌తోపాటు ట్రాలీ 300 మీటర్లు దూరం దూసుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ట్రాలీలో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని అంబులెన్సులో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన విష్ణు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు హైదారాబాదులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అబ్దుల్లా తలకు తీవ్ర గాయం కాగా.. మిగతా వారికి స్వల్ప గాయాలతో వనపర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో మృతుల బంధువులు, గ్రామస్తులు చేరుకోవడంతో పరిసరాలు అర్థనాదాలతో నిండిపోవడంతో పలువురిని కలిచి వేశాయి. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డితోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, రాష్ట్ర నాయకులు అయ్యంగారి ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకొని మృతులకు నివాళులర్పించి బాధిత కుంటుబాలను పరామర్శించారు.

నిమజ్జనం చేసి వస్తుండగా..అపశ్రుతి1
1/2

నిమజ్జనం చేసి వస్తుండగా..అపశ్రుతి

నిమజ్జనం చేసి వస్తుండగా..అపశ్రుతి2
2/2

నిమజ్జనం చేసి వస్తుండగా..అపశ్రుతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement