
కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
– గట్టు
అమరచింత: రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేవిధంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరభాస్కర్ తెలిపారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి శుక్రవారం అమరచింతకు వచ్చిన ఆయన భక్త మార్కండేయ ఆలయంలో చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పరంగా చేనేత కార్మికులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. చాలామంది కార్మికులు మగ్గాలపై జరీ చీరలను తయారు చేస్తున్న నేటికీ జౌళిశాఖ అధికారులు జియోట్యాగ్ నంబర్లను ఇవ్వకపోవడంతో పథకాలకు కార్మికులు దూరమవుతున్నారని తెలిపారు. పక్కనున్న జోగుళాంబ గద్వాల జిల్లాలో మగ్గానికి ముగ్గురు కార్మికులకు నేతన్నకు చేయూత పథకాన్ని వర్తింపజేశారని, ఇక్కడమాత్రం మగ్గానికి ఇద్దరు కార్మికులనే ఎందుకు పరిమితం చేశారో అర్థం కావడం లేదన్నారు. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేస్తూ కార్మికులు రాయితీలను పొందేలా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి కార్మికులు లబ్దిపొందేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్రస్థాయి చేనేత అవార్డులను అందుకున్న పట్టణానికి చెందిన దేవరకొండ లచ్చన్న, మహాంకాళి సులోచనను సన్మానించారు. కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సత్యన్న, నాగరాజు, చింతన్న, రాములు, సత్తి, కురుమన్న, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు
రాపోలు వీరభాస్కర్