
నేడు మూసాపేటకు మంత్రి పొంగులేటి
అడ్డాకుల: మూసాపేట మండల కేంద్రానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం రానున్నారు. మూసాపేటలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి వేర్వేరుగా వచ్చి మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. గృహ ప్రవేశ కార్యక్రమం అనంతరం జరిగే బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు ఇక్కడికి రానున్నట్లు ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కార్యక్రమానికి హాజరు కానున్నారు. జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మిస్తున్న ఇళ్లలో మూసాపేటలోనే మొదటి ఇళ్లు ప్రారంభోత్సవం జరుగుతుండడం విశేషం. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, హౌసింగ్ పీడీ భాస్కర్, తహసీల్దార్ రాజునాయక్, ఎంపీడీఓ కృష్ణయ్య, పార్టీ మండలాధ్యక్షుడు శెట్టిశేఖర్, వివిధ గ్రామాల నాయకులు తదితరులు ఉన్నారు.
మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
● ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం
మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రూవరీ(చిన్న తరహా బీరు పరిశ్రమ) ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎకై ్సజ్ డీసీ విజయ భాస్కర్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిసారి జిల్లాకేంద్రంలో కార్పొరేషన్‌లలో బీరు తయారు చేసి విక్రయాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు వెయ్యి చదరపు మీటర్లతో కూడిన ప్రాంగణం అవసరం ఉంటుందని, దీనికి రూ.1లక్ష డీడీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దీని ద్వారా బీరు తయారు చేసి అక్కడే విక్రయాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తుతో పాటు రూ.1లక్ష డీడీ, ఆధార్ కార్డు, ప్రస్తుతం బార్, క్లబ్, రెస్టారెంట్ ఉంటే వాటి లైసెన్స్ జిరాక్స్ జత చేసి ఈ నెల 25లోగా వరకు ఎనుగొండలోని డీసీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఎంపికై నా వారు 180 రోజుల్లో చిన్న తరహా బీరు పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, లైసెన్స్ ఫీజు రూ.5 లక్షలతో పాటు ఎకై ్సజ్ డ్యూటీ చెల్లించాలని కోరారు. ఇతర వివరాలకు 87126 58872 సంప్రదించాలని సూచించారు.
8న కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు ‘చేయూత’ పింఛన్లు పెంచాలని కోరుతూ ఈనెల 8న కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నామని ఎంఆర్‌పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్రా భిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి భైరపోగు శివకుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింఛన్ల పెంపుతో పాటు కొత్తవారికి సైతం మంజూరు చేయాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై పోరాడటంలో ప్రతిపక్ష పార్టీలన్నీ విఫలమయ్యాయని ఆరోపించారు. అందుకే ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పింఛనుదారుల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. ఈనెల 12న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా, 20న హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం, 21 నుంచి 26 వరకు గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట ధర్నా, 27న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్భందం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నరేందర్, శ్రీరామ్, కమలాకర్, పోలె బాలయ్య, జె.బాలరాజు, సుజాత, లక్ష్మి పాల్గొన్నారు.

నేడు మూసాపేటకు మంత్రి పొంగులేటి