
నిజాయితీ చాటుకున్న రైతు
అమరచింత: నిజాయితీ కరువైన ఈ రోజుల్లో సమాజంలో ఇంకా నీతి నిజాయితీ ఉందని నిరూపించాడు అమరచింతకు చెందిన రైతు కొండన్న. వ్యవసాయ రుణం రెన్యూవల్ కోసం బుధవారం పట్టణంలోని యూనియన్ బ్యాంక్‌కు వెళ్లిన కొండన్నకు బ్యాంక్ లోపల 5 తులాల బంగారు గొలుసు కిందపడి ఉండటం గమనించాడు. వాటిని చేతిలోకి తీసుకుని చూడగా బంగారు నానుగా గుర్తించాడు. ఎవరైనా రైతులు పారేసుకున్నారని బావించి అక్కడే ఉన్న బ్యాంక్ మెనేజర్ రామకృష్ణకు బంగారు గొలుసు అందించాడు. సుమారు రూ.5 లక్షల పైగా విలువైన బంగారు గొలుసును నిజాయితీగా బ్యాంక్ మెనేజర్‌కు అప్పగించడంతో పలువురు అభినందించారు. ఈ విషయంపై మేనేజర్‌ను అడుగగా బ్యాంకులో బంగారు గొలుసు దొరికిందని రైతు కొండన్న తమకు అప్పగించాడన్నారు. గొలుసు పోగొట్టుకున్న రైతు వస్తే విచారించి వారికి అందిస్తామన్నారు.