
భాషా పండితుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో భాషాపండిత్‌ల పాత్ర కీలకమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక బీకేరెడ్డి కాలనీలోని మహబూబ్‌నగర్ ఫస్ట్–నవరత్నాలు శిక్షణ కేంద్రంలో రెండోరోజు మంగళవారం ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ సబ్జెక్టులలో పట్టు సాధించేందుకు ల్యాంగ్వేజెస్ ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటి ద్వారా ఇతర సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ‘శత శాతం’తో పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గాయని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేయాలని, ముఖ్యంగా స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిజిస్టర్ (ఎస్‌ఐఆర్) నిర్వహించాలన్నారు. అనంతరం ఇక్కడి ఆవరణలో ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డీఈఓ ప్రవీణ్‌కుమార్, సీఎంఓ బాలుయాదవ్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్, మహబూబ్‌నగర్ ఫస్ట్ కేంద్రం ఇన్‌చార్జ్ నిజలింగప్ప తదితరులు పాల్గొన్నారు.