
15 రోజులుగా పడిగాపులే..
15రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నా. పంటకు యూరియా వేయకుంటే ఆశలు వదులుకునే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఇంత కష్టం వస్తుందని తెలిస్తే పంటల జోలికి వెళ్లేవాడిని కాదు. – రాజు, రైతు, చెన్నారెడ్డిపల్లి, నవాబుపేట
అప్పులు చేసి పంటసాగు..
అప్పులు చేసి వరిపంట వేసుకున్నా. యూరియా వేసుకునే అదును వచ్చింది. ఇక్కడ చూస్తే ఎవరు యూరియా అమ్ముతారో తెలియని పరిస్థితి ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకే వచ్చా. వారం రోజులుగా వస్తున్నా కావాల్సిన యూరియా దొరకడం లేదు.
– ఉంద్యాల లక్ష్మి, మహిళా రైతు, గోపన్‌పల్లి, దేవరకద్ర
చేతకావడం లేదు..
అయ్యా.. చేత కావడం లేదు. రెండు సంచుల యూరియా ఇప్పించండి. రోజు వచ్చి పడిగాపులు పడుతున్నా. లైన్‌లో నిలబడలేకపోతున్నా. వచ్చినప్పుడల్లా లైన్ చూసి వెళ్లిపోతున్నా. పంటకు యూరియా చల్లాలి. ఎవరైనా కనికరించండి.
– వెంకటమ్మ, వృద్ధ మహిళా రైతు, చిన్నచింతకుంట
●

15 రోజులుగా పడిగాపులే..

15 రోజులుగా పడిగాపులే..