
గ్రామీణ ఓటర్లు 4,99,582
● 423 గ్రామపంచాయతీల్లో 3,674 పోలింగ్ కేంద్రాలు
● తుది జాబితాను విడుదల చేసిన అధికారులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఎన్నికలకు ముఖ్యమైన ఓటరు తుది జాబితా కూడా మంగళవారం విడుదల చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాలను కూడా విడుదల చేశారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వెంటనే నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. సర్పంచ్‌గా పదవీ కాలం 2024 జనవరి 31తో పూర్తయింది. సర్పంచ్‌లు లేకపోవడంతో గ్రామాలకు వచ్చే నిధులు రాకుండా ఆగిపోయాయి. తుది జాబితా ప్రకారం జిల్లాలో 4,99,582 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. 423 గ్రామపంచాతీల్లో 3,674 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. డీపీఓ పార్థసారథి మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలునిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

గ్రామీణ ఓటర్లు 4,99,582