
జిల్లాకు చేరిన 450 మె.ట. యూరియా
జడ్చర్ల టౌన్: జిల్లాకు 450 మెట్రిక్ టన్నుల క్రిబ్‌కో యూరియా రేక్‌తో కూడిన గూడ్స్ రైలు మంగళవారం జడ్చర్ల రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. మండలాల వారీగా కేటాయింపుల ప్రకారం లారీల ద్వారా యూరియా సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యూరియా వచ్చిన సమాచారం అందుకున్న కలెక్టర్ విజయేందిర.. జడ్చర్ల రైల్వేస్టేషన్‌కు చేరుకొని యూరియా రేక్‌ను పరిశీలించారు. జిల్లాలోని అన్ని మండలాలకు సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వర్లును ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం 450 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని.. త్వరలోనే మరింత యూరియా రానుందన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, యూరియా రేక్ పరిశీలనకు వచ్చిన కలెక్టర్‌ను స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కలిశారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. జడ్చర్ల నియోజకవర్గానికి 200 మెట్రిక్ టన్నులు కేటాయించాలని కోరారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఇన్‌చార్జీ ఏడీ గోపినాథ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జ్యోతి, మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత ఉన్నారు.
● జిల్లాకు కేటాయించిన యూరియాను లారీల ద్వారా ఆయా ప్రాంతాలకు సరఫరా చేయడాన్ని డీఏఓ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. జూన్, జూలైలో యూరియా పక్కదారి పట్టిందని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా.. పై విధంగా స్పందించారు. జడ్చర్ల పరిధిలో జరిగిన యూరియా పంపిణీపై విచారణ చేయాలని ఇన్‌చార్జి ఏడీ గోపినాథ్‌ను ఆయన ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా వానాకాలంలో 3,64,523 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా.. 38,787 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమన్నారు. ఇదివరకే 21,376 మెట్రిక్ టన్నులు వచ్చిందని.. ప్రస్తుతం మరో 450 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు.