
కర్వెన ప్రాజెక్టు పరిశీలన
భూత్పూర్: మండలంలోని కర్వెన వద్ద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును మంగళవారం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు పనుల గురించి డీఈ విజయేందర్‌తో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, చేయాల్సిన పనుల గురించి ఆరా తీశారు. ఆయన వెంట ఆర్‌డీఓ నవీన్, తహసీల్దార్ కిషన్‌నాయక్ తదితరులు ఉన్నారు.
పీయూలో అధికారుల నియామకం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు అధికారులను నియమిస్తూ వీసీ శ్రీనివాస్ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు లా కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా పొలిటికల్ సైన్స్ సీనియర్ అధ్యాపకులు భూమయ్యను నియమించారు. ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా కంప్యూటర్ అప్లికేషన్స్ గౌస్ మోయినోద్దీన్‌ను నియమించారు. పీఆర్వోగా సోషల్ వర్క్ విభాగానికి చెందిన గాలెన్నను నియమించారు. అకాడమిక్ ఆడిట్ సెల్ కోఆర్డినేటర్‌గా రవికుమార్‌ను నియమించారు. తమపై నమ్మకం ఉంచి భాద్యతలను అప్పగించినందుకు అధికారులు వీసీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ప్రిన్సిపాళ్లు, కరుణాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ గ్రూప్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మోహన్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కన్వీనర్ కోటాలో సీట్ల కోసం ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామని, 11వ తేదీన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు పదో తరగతి పూర్తి చేసి, పాలిసెట్ రాసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అఖండ దీపారాధన ప్రారంభం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి అఖండ దీపారాధన పూజా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది స్వామివారి క్షేత్ర పాలకుడైన వీరభద్రస్వామి అఖండ దీపారాధన వ్రత మహోత్సవాన్ని 41 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం మరుసటి రోజు స్వామివారి అగ్నిగుండం కార్యక్రమాన్ని చేపడతారు. ప్రారంభోత్సవం సందర్భంగా స్వామివారిని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, తదితరులు పాల్గొన్నారు.

కర్వెన ప్రాజెక్టు పరిశీలన

కర్వెన ప్రాజెక్టు పరిశీలన