
శ్రావణం.. శుభకరం
అచ్చంపేట/స్టేషన్ మహబూబ్‌నగర్/కృష్ణా: శ్రావణమాసం.. మహిళలకు ప్రత్యేక మాసంగా చెప్పవచ్చు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో మహిళలు మంగళగౌరి, శ్రావణలక్ష్మి (వరలక్ష్మి) పూజలు, పేరంటాలు, వ్రతాలతో ఎంతో సందడిగా గడుపుతారు. అమ్మవారి ఆరాధన, నోములు, వ్రతాలు సీ్త్రలకు సకల సౌభాగ్యాలు కలిగిస్తాయని వారి నమ్మకం. లక్ష్మీదేవి జన్మించింది కూడా శ్రావణ మాసంలోనే అని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీమహావిష్ణువు శ్రవణ నక్షత్రంలోనే జన్మించడంతో ఈ మాసం ఆమెకు ప్రీతికరమైందని చెబుతున్నారు. ఈ మాసంలో చేసే అన్ని పూజల్లోకెల్లా వరలక్ష్మి వ్రతం ఉత్తమమైందని.. మొదట ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడని ప్రతీతి. ఈ వ్రతం చేసిన మహిళలకు సంతానం, ధనధానాలు, సంపూర్ణ ముత్తైదువుతనం, సంతానం, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణంలో పేర్కొన్నారు.
వరలక్ష్మి వ్రతం..
వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి సకల ఉపచారాలతో ఈ వ్రతం నిర్వహిస్తారు. ఈ వ్రతంలో తొమ్మిది సంఖ్యకు ప్రాధన్యం. అందుకే తొమ్మిది పోగులతో కూడిన తోరణం ధరించి, తొమ్మిది రకాల పిండివంటలు నివేదన చేసి ముత్తైదువులకు వాయిణమిస్తారు. బూరెలు, బొబ్బట్లు, పులగం, గారెలు, పూర్ణాలు, పరమాన్నం, పులిహోర, రవ్వ కేసరి తదితర పిండివంటల్లో భాగంగా ఉంటాయి.
తిరు నక్షత్ర మహోత్సవాలు..
ఆలయాల్లో అండాళ్ తిరునక్షత్ర మహోత్సవాలు నిర్వహిస్తారు. తొలి శ్రావణ శనివారం సందర్భంగా తులసి అర్చన చేస్తారు.
వివాహాలు, శుభకార్యాలు..
శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, గృహాప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేసేందుకు ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకున్నారు. ఈ నెల 26, 30, 31, ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17లో వివాహ ముహూర్తాలున్నాయి.
పండుగలకు ప్రత్యేకం..
శ్రావణమాసం పండుగలకు ప్రత్యేకమైందిగా చెప్పవచ్చు. ఈ మాసానికి నభోమాసమని మరో పేరుంది. ప్రతి హైందవుడి ఇంట్లో ఈ నెలంతా పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. ఆలయాల్లో సామూహిక కుంకుమార్చనలు, తులసి అర్చనలు, పుష్పార్చనలు, రుద్రాభిషేకాలు తదితర పూజలు చేస్తారు. వర్షాలు కురవాలని శివుడికి ఘఠాభిషేకం చేయడం ఆచారంగా ఉంది.
– తోటపల్లి శ్రీకాంత్‌శర్మ,
అర్చకుడు, మహబూబ్‌నగర్
హిందువులకుపవిత్ర మాసం..
హిందువులకు శ్రావణమాసం అతి పవిత్రమైంది. ఈ మాసంలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ప్రతి హిందువు నెలరోజుల పాటు ఇంట్లో పూజలు నిర్వహించడంతో పాటు శుచి, శుభ్రత, పవిత్రత, మడి, ఆచారం, సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవడం, మద్యం, మాంసం ఆరగించకుండా భక్తితో ఉంటారు. – రాజశేఖర్‌స్వామి,
ప్రధాన అర్చకుడు, పార్వతీ పరమేశ్వర
దేవస్థానం, చేగుంట (కృష్ణా)
నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం
పండుగలకు నెలవైన మాసం
శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరం
శుభ్రత, సాత్వికత, ప్రేమలో...
శుచి, శుభ్రతతో ఉండే ఇళ్లు, తోటి వారితో కలిసిమెలిసి ఉండే వారి ఇళ్లు, పాపపు ఆలోచనలు చేయని, తప్పులు చేయని వారిలో, ప్రేమ, సేవాభావం కలిగిన వారిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కేవలం ధనంగానే కాకుండా ఆరోగ్యం, ఐశ్యర్యం, ఆయుష్షు, అందం, బంధుగణం, సంపద, సౌకర్యాలు, సీ్త్రలు, ఆచారాలు, ఆలయాలు, వస్త్రాలు, విద్య, కళలు, పరికరాలు, పుష్పాలు తదితర అన్ని అంశాల్లోనూ నెలవై ఉంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

శ్రావణం.. శుభకరం

శ్రావణం.. శుభకరం

శ్రావణం.. శుభకరం