
మార్మోగిన గోవింద నామస్మరణ
చిన్నచింతకుంట: ఆషాడ మాసం అమావాస్య పురస్కరించుకొని గురువారం పేదల తిరుపతిగా పేరుగాంచిన కుర్తిమూర్తి కొండలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. కొందరు క్యూలైన్‌లో నిల్చొని స్వామి వారి దర్శనానికి వెళ్లగా మరికొందరు మెట్టు మెట్టుకు కుంకుమ పెడుతూ, దీపాలు వెలింగి ముందుకు సాగారు. స్వామివారి దర్శించుకొని పరవశించిపోయారు. కొండపైన అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయ స్వామి, ఉద్దాల మండపం వద్ద భక్తులు దర్శించుకున్నారు. కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా తయారు చేసి స్వామికి సమర్పించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీగా కనిపించింది. జాతరమైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాలల్లో స్వీట్లు, తదితర వస్తువులను కొనుగోలు చేశారు. వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మధనేశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పరిశీలించారు.
అన్నదాతలు పేర్లు నమోదు చేసుకోవాలి
అన్నదాతలు దేవస్థానం కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి ఈఓ మధనేశ్వర్‌రెడ్డిలు కోరారు. ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి, ప్రతి శనివారంను ఆలయం ప్రాగణంలో భక్తులకు అన్నదానం చేస్తునట్లు తెలిపారు. అమావస్యం రోజు అన్నదానం కోసం రూ.25 వేలు, పౌర్ణమి రోజు రూ. 6వేలు,, శనివారం రూ.6వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కురుమూర్తి గిరులు భక్తులతో కిటకిట
నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు
కురుమూర్తి స్వామి ఆలయంలో నెల రోజుల పాటు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 23 వరకు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. వచ్చేనెల 6న లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన, 7న స్వామి వారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, 8న స్వామివారికి అభిషేకం, పవిత్రారోహణం తదితర కై ంకర్యాలు నిర్వహించనున్నారు.