
రైతులకు ఇబ్బందులు రాకుండా చూడండి
జడ్చర్ల/బిజినేపల్లి/భూత్పూర్: రైతులకు యూరియా ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్లు పద్మహర్ష, హర్ష ప్రభ అధికారులను ఆదేశించారు. గురువారం సాక్షి దినపత్రిలో యూరియా కోసం పడిగాపులు శీర్షికన వచ్చిన కథనంపై వీరు స్పందించారు. ఈ నేపథ్యంలో జడ్చర్లతో పాటు భూత్పూర్ తదితర చోట్ల వేర్వేరుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జేడీ పద్మహర్ష డీఏఓ వెంకటేశ్, మార్కెటింగ్ ఏడీ బాలమణి, తదితర అధికారులతో కలిసి స్థానిక గంజ్‌లోని హాకా ఫార్మర్ సర్వీస్ సెంటర్‌తో పాటు ఇతర ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి యూరియా, తదితర ఎరువుల లభ్యతపై విచారించారు. బస్తా ధర రూ.267 ఉండగా డీలర్లు రూ.275కు విక్రయించడంపై విచారించారు. హమాలీ చార్జీలతో కలుపుకుని విక్రయిస్తున్నట్లు డీలర్లు వివరణ ఇచ్చారు. అలాగే జేడీ హర్షప్రభ సైతం జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్‌తో కలిసి భూత్పూర్ పట్టణంలోని సింగిల్ విండోతో పాటు ఫెస్టిసైడ్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. మండలానికి ఎరువుల ఎంత మేరకు అలాట్‌మెంట్ చేశారు, ఇప్పటి వరకు ఎంత సరఫరా చేశారు అని జేడీఏ వెంకటేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. భూత్పూర్ మండలానికి 294 టన్నుల యూరి యా అలాట్‌మెంట్ చేసి, 249 మెట్రిక్ టన్నుల యూరియాను వివిధ ఎరువుల దుకాణాలకు సరఫరా చేసినట్లు వివరించారు. అలాగే 45 టన్ను ల యూరియా రైతులకు అందుబాటులో ఉంచినట్లు జేడీఏ వెంకటేష్ వివరణ ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి పీఏసీఏస్ కేంద్రాల ద్వారా ఏరువులు సరఫరా చేయాలని సీఈవో రవికి సూచించారు. కొన్ని దుకాణాల్లో ఇతర ఎరువులు, మందులు కొంటేనే ఎరువులను విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఏడీ పూర్ణచంద్రారెడ్డికి సూచించారు.

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడండి