
భాస్వరం.. పొటాషియం కీలకం
ప్రాధాన్యత ఇలా..
● పైరుకు ఆరోగ్యం, ధృడత్వం చేకూరుతుంది.
● మొక్కల్లో జరిగే జీవ రసాయన క్రియలకు, ఆకుల్లో తయారైన పిండి పదార్థం ఇతర
భాగాలకు చేరేందుకు..
● పైరుకు రోగ నిరోధకశక్తిని కలిగించి పురుగులకు, తెగుళ్ల నుంచి కాపాడుతుంది.
● శాఖీయ భాగాలను, కాండాన్ని
బలపరిచి నేలపై వాలనీయదు.
● గింజ కట్టు పూర్తిగా ఉండి నాణ్యత
పెరుగుతుంది.
● ప్రత్యేకించి పండ్లు కూరగాయాలు మొదలగు పంటల్లో నాణ్యత పెరగడానికి దోహదపడుతుంది.
● చలి వాతవరణం లాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.
పొటాషియం లోపిస్తే..
● ముదురు ఆకుల అంచులు ఆకు పచ్చ
రంగు నుంచి పసుపు రంగులోకి మారతాయి.
● ఆకు కొనలు గోధుమ రంగులోకి
మారి దిగువ భాగానికి విస్తరిస్తుంది.
● పెరుగుదల నెమ్మదిగా ఉండి మొక్క
గిడసబారుతుంది.
● కాండం బలంగా లేక సులభంగా
వాలిపోతుంది.
● పండ్లు కూరగాయాల్లో రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం తగ్గుతుంది.
అలంపూర్: మొక్క పెరుగుదలలో నత్రజని, భాస్వ రం, పొటాషియంల పాత్ర ముఖ్యమైంది. పంటల పెరుగుదలలో భాస్వరం, పొటాషియం పాత్రల ప్రాముఖ్యతను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ రైతులకు వివరించారు.
భాస్వరం: ఈ పోషకాన్ని మొక్కలు భాస్వరికామ్ల లవణాల రూపంలో తీసుకుంటాయి. భాస్వరానికి నేలలో కొట్టుకపోయే స్వభావం లేదు. అయితే కొంత భాగం నేలలో బిగుసుకుపోతుంది. మట్టి రేణువులకు అంటిపెట్టుకొని తర్వాత పైరుకు కూడా ఉపయోగపడుతుంది. పైరుకు ప్రథమ దశలో భాస్వరం అవశ్యకత అధికం కావున పూర్తి మోతాదు మొదటనే పైరు అడుగులో ఒకేసారి వేయాలి. దానిని నేలలో కలిసేటట్టు చేయాలి.
పంటల పెరుగుదలలో భాస్వరం పాత్ర
● పూత, కాత గింజ పట్టడానికి
● పైరు దుబ్బు చేయుటకు, మొక్క శాఖోప శాఖలుగా పెరిగేందుకు
● సేంద్రియ పదార్ధాలు బాగా చివుటకు
● మొక్కల్లో మాంసకృత్తులు, ఎంజైముల తయారీకి
● భాస్వరం, నత్రజని తగినంత మోతాదులో ఉన్నప్పుడు రెండింటిని మొక్క అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఒకదానికి ఒకటి తోడ్పడతాయి.
భాస్వరం లోపిస్తే..!
● మొక్క పెరుగుదల, పిలకలు పెట్టె శక్తి తగ్గుతుంది.
● వేరు వ్యవస్థ బలహీనంగా ఉంటుంది.
● ఆకులు ముదురు ఆకుపచ్చ, నీటి రంగు కలిసినట్లుగా ఉంటాయి.
● పూత రావడం, పైరు పక్వానికి రావడం ఆలస్యం అవుతుంది.
పొటాషియం: ఈ పోషకాన్ని మొక్క పొటాషియం రూపంలో తీసుకుంటుంది.
పాడి–పంట

భాస్వరం.. పొటాషియం కీలకం

భాస్వరం.. పొటాషియం కీలకం